మంత్రులపై అధికారుల పెత్తనం… ఆగ్రహంగా మంత్రులు…!

-

ప్రభుత్వంలో అధికారుల పాత్ర అనేది చాలా కీలకం… వాళ్ళు ఏది చేసినా సరే మంత్రులు, ముఖ్యమంత్రుల ఆదేశాలు ఉండాలి. చీఫ్ సెక్రటరి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, ప్రభుత్వ శాఖల అధికారులు ప్రతీ ఒక్కరు కూడా జాగ్రత్తగా తమ శాఖల అధినేతల ఆదేశాలు పాటించడం అనేది కీలకం. వారిని దాటి వెళ్ళే ప్రయత్నం కూడా చేయకూడదు. మంత్రులు ఏదైనా నిర్ణయం తీసుకుంటే వాళ్ళు తప్పు ఉంటే తప్పు అని చెప్పడం, ఆ నిర్ణయంలో లోపాలు ఉంటే వాటి వలన జరిగే పరిణామాలు చెప్పడం వంటివి చెయ్యాలి.

అంతే గాని సొంత పెత్తనం అనేది మంచిది కాదు… కాని తెలంగాణాలో మాత్రం కీలక శాఖల్లో… ఉన్న అధికారులు… అసలు ప్రతీ శాఖలో ఉన్న అధికారులు మంత్రులను ఎదిరించే స్థాయికి వెళ్ళారు అనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఒక మంత్రి గారు ఒక ఫైల్ కి సంబంధించి అధికారికి ఫోన్ చేస్తే సదరు అధికారి గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు… ఆ తర్వాత ఆ విషయాన్ని ఒక కీలక వ్యక్తికి మంత్రి ఫోన్ చేసి ఇది పరిస్థితి అనగానే… ఆ మంత్రికి అధికారి నుంచి ఫోన్ వచ్చింది… ఆ అధికారి… మంత్రి మాటను కనీసం వినకుండా… ఆ ఫైల్ పని అయిపోయింది అని చెప్పారట.

మీరు సంతకం పెట్టడమే మిగిలి ఉంది అన్నారట. ఈ పరిస్థితి ప్రతీ మంత్రికి ఎదురు అవుతుంది. అసలు సమాచారం కూడా తమకు ఇవ్వకుండా నిర్ణయాలు అధికారులు సీనియారిటి కారణం, అందుబాటులో లేమనే కారణం తో తీసుకుంటున్నారు అని ఆగ్రహంగా ఉన్నారట. ఈ చికాకు మంత్రులకు ఇప్పుడు ఎక్కువగా ఉందని సమాచారం. ఇటీవల ఉత్తర తెలంగాణకు చెందిన మంత్రి… తన సహచర మంత్రులతో నేను హైదరాబాద్ వెళ్ళడమే మానేసా… జిల్లానే ప్రశాంతంగా ఉందని, మీరు కూడా వెళ్ళకండి అని ఒక సలహా ఇచ్చారట. దాదాపు అందరు మంత్రుల పరిస్థితి ఇలాగే ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news