గణేష్ ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వ ఆంక్షలపై తెలంగాణ ఎమ్మెల్యే సంకలన వ్యాఖ్యలు.

-

కరోనా మహమ్మారి కారణంగా గణేష్ ఉత్సవాలను ఇళ్ళల్లోనే జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేశంలో థర్డ్ వేవ్ వచ్చే సూచనలు ఎప్పుడైనా ఉండవచ్చని, అందువల్ల పండగను ఇళ్ళలోనే జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హిందూ పండగలపై ఆంక్షలు విధించడం సరికాదని, కేవలం ఇళ్ళల్లోనే జరుపుకోవాలని చెప్పడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.

తాజాగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించాడు. హిందువుల మనోభావాలను దెబ్బకొడుతున్నారని, కరోనా నిబంధనలు పాటిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేసారు. స్కూళ్ళు, కాలేజీలకు లేని కరోనా, పండగలకే వర్తిస్తుందా అంటూ కామెంట్లు విసిరారు. మరి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news