డ్రగ్స్ నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ ని లేకుండా చేయడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ నిర్మూలన కోసం రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్ సీపీ కార్యాలయం కేంద్రంగా నడవనున్న హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ , నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్విజన్ వింగ్ , ఈ రెండు కేంద్రాలను డీజీపీ మహేందర్ రెడ్డి , సీపీ సీ వీ ఆనంద్ లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ సీ వీ ఆనంద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ..హైదరాబాద్ ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రగ్స్ మహమ్మారి ని నిర్మూలించేందుకు నాలుగు నెలలుగా పెద్దఎత్తున దాడులు చేసామని.. హైదరాబాద్ కు చెందిన కొంత మంది డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, టోనీ నీ విచారిస్తే..డ్రగ్స్ వాడుతున్న వ్యాపారుల గుట్టు తెలిసిందని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ కొత్త విభాగాన్ని ఏర్పాటు చేశామని.. నార్కోటిక్స్ ఎన్ఫోర్స్ మెంట్ విభాగం ..టాస్క్ ఫోర్స్ విభాగం మాదిరిగా పని చేస్తారన్నారు. డ్రగ్స్ పై నిఘా పెట్టడం తో పాటు నిందితుల ను పట్టుకునేందుకు మాత్రమే ఈ న్యూ( NEW ) పనిచేస్తుందని.. మేము కేసులు పెడుతున్నా… కోర్టులలో శిక్షలు పడట్లేదన్నారు. NDPS యాక్ట్ పై కొందరు అధికారులకు ప్రత్యేక శిక్షణ అవసరమన్నారు.