వెదర్ ఆప్డేట్… తెలంగాణలో మరో మూడు రోజులు వర్ష సూచన

-

తెలంగాణలో వర్షం దంచికొడుతోంది. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ తో పాటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. ఉరుములు మెరుపులతో వర్షాల కురిశాయి. వర్షాల ధాటికి జంటనగరాల రోడ్లు జలాశయాలను తలపిస్తున్నాయి. జిల్లాలో మామిడి తోటలకు, కోసి కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తీవ్ర నష్టం వాటిల్లింది. పలు చోట్ల నిల్వ చేసిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. టార్పలిన్లు లేక ధాన్యం తడిసిపోయింది.  అకాల వర్షాల వల్ల పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది.

ఇదిలా ఉంటే మరో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. రేపు తేలికపాటి వర్షాలు కురిస్తాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news