ప్రశ్నపత్రాల లీక్ లు ఆగవా ? విద్యార్థుల్లో తీవ్ర నిరాశ !

-

తెలంగాణ టెన్త్ క్లాస్ విద్యార్థులు తీవ్ర నిరాశలో ఉన్నారు. నిన్నటి నుండి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ మొదలవ్వగా… కాసేపటికే వికారాబాద్ జిల్లా తాండూరులో తెలుగు పేపర్ వాట్సాప్ లో లీక్ అయింది. దీనిపై విచారణ చేసి ముగ్గురిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై పూర్తి విచారణ జరుగుతుండగానే, మళ్ళీ ఈ రోజు వరంగల్ జిల్లాలో హిందీ ప్రశ్నాపత్రం వాట్సాప్ లో లీక్ అయింది. దీనితో ఒక్కసారిగా విద్యార్థులు మరియు తల్లితండ్రులు ఏమి చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

అయితే మొన్న గ్రూప్ 1 పరీక్ష లీక్ దగ్గర నుండి టెన్త్ క్లాస్ లీక్ వరకు ఎవరు బాద్యులు అని చెప్పాలి. కానీ ప్రస్తుతం ఇలాంటి వాటి వలన నష్టపోయేది మాత్రం రాత్రనక , పగలనక కష్టపడి చదువుతున్న విద్యార్థుల ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరి ఈ లీకులు ఎందుకు జరుగుతున్నాయి ? ఎవరు దీనికి కారణం ? ఇకనైనా లీకులు ఆగుతాయా లేదా అన్నది చూడాలి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news