బర్గర్లను పేపర్లో చుట్టి ఇస్తారు కదా.. ఆ పేపర్‌ ఎంత డేంజరో తెలుసా..?

-

పిజ్జా, బర్గర్లు అంటే ఇష్టపడని వాళ్లు అంటూ ఎవరూ ఉండరేమో.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ వీటికి ఫ్యాన్స్‌హే.. మీరు బేకరీస్‌లో బర్గర్స్‌ ఆర్డర్‌ ఇచ్చినప్పుడు.. చూసేఉంటారు.. అది ఒక పేపర్లో చుట్టి ఇస్తారు.. చేతికి అంటకుండా… పేపరే కదా అని మనం లైట్‌ తీసుకుంటాం. కానీ మీకు తెలుసా.. ఆ పేపరే మీకు భయంకరమైన రోగాలను తీసుకొస్తుందని. మీరు అనుకున్నట్లు అది కాకితం మాత్రమే కాదు. అది ఓ ప్లాస్టిక్ కలిసిన కాగితం. దానివల్ల మానవ ఆరోగ్యానికే కాదు, పర్యావరణానికీ హానికరం. ఈ విషయాన్ని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఒక అధ్యయనంలో తేల్చింది.

ఆ పేపర్లను సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. దీనిలో పెర్ఫ్లూరోక్టానోయిక్ సల్ఫేట్ (PFOS) అనే రసాయనం ఉంటుంది. ఈ రసాయనంతో తయారు చేసిన పేపర్లను నూనె చేతికి అంటకుండా తయారు చేస్తారు. కాబట్టి వీటిని ఫాస్ట్ ఫుడ్ షాపుల వాళ్ళు ఎక్కువగా వాడేస్తారు.. ఈ కాగితాల్లో వాడే రసాయనాలు వెంటనే విచ్ఛిన్నం కావు. చాలా నెమ్మదిగా విచ్ఛిన్నం అవ్వడం మొదలవుతాయి. అవి అనుకోకుండా శరీరంలో చేరితే కాలేయానికి హాని చేస్తాయి.

కెనడా, అమెరికా, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన పరిశోధకులు ఒక బృందంగా ఏర్పడి 42 రకాల పేపర్ ఫుడ్ ప్యాకేజింగ్‌లను పరీక్షించారు. అందులోనే ఈ సాండ్‌విచ్, బర్గర్లకు చుట్టే పేపర్లు, పాప్ కార్న్ సర్వింగ్ బ్యాగులు, డోనట్స్ బ్యాగులు ఉన్నాయి. వారి అధ్యయనంలో వీటన్నింటిలో కూడా 45% ఫ్లోరిన్ ఉన్నట్టు కనుగొన్నారు.. ఫ్లోరిన్ ఎంత ప్రమాదకరమైనదో మీకు స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

మనం ఏం అనుకుంటాం అంటే..ఆ కాగితం తినం కదా, పడేస్తాం… ఏం కాదులే అనుకుంటాం.. కానీ కంటికి కనిపించని సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు ప్యాకేజింగ్ ద్వారా ఆహారానికి అంటుకుంటాయి. అవి మీ శరీరంలోకి చేరడం చాలా సులువు. ఆహారం వేడిగా ఉన్నప్పుడు ఈ కాగితం మీద పెడితే త్వరగా ఆ కాగితంలోని రసాయనాలు ఆహారానికి అతుక్కునే ప్రమాదం ఉంది. తద్వారా ప్రమాదకరమైన క్యాన్సర్లకు కారణం అవుతాయని అధ్యయనకర్తలు అంటున్నారు… రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. సంతానోత్పత్తి కాకుండా అడ్డుకుంటాయి. జీవక్రియను నెమ్మదిగా మార్చేస్తాయి. దీనివల్ల ఊబకాయం ప్రమాదం పెరుగుతుంది.

అసలు ఆ బర్గర్లు, పిజ్జాలే ఆరోగ్యానికి మంచిది కాదు.. మీదికెళ్లి మీ పేపర్లతో ఇంకో పంచాయితీ.. తెలిసి తెలిసి ఇంత పాడు ఆహారం అవసరమా..! ఎందుకు ఇవన్నీ తిని.. లావుగా అయిపోయి.. అనవసరమైన రోగాల బారిన పడటం.. ఆరోగ్యాన్ని మించిన సంపద ఇంకోటి ఉండోదు.. ఒక్కసారి ఆసుపత్రికి వెళ్లామంటే.. పైసలు పారే నీళ్లులా అయిపోతాయి.. జాగ్రత్తపడండి ఇకనైనా..!!

Read more RELATED
Recommended to you

Latest news