తెలంగాణలో 4 కోట్ల మైలురాయిని చేరిన వ్యాక్సిన్ డోసులు..

-

తాజాగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తెలంగాణ కీలక మైలురాయిని చేరుకుంది. రాష్ట్రంలో ప్రజలకు 4 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారికి 94 శాతం మొదటి డోసు పూర్తి అవ్వగా.. 50 శాతం మందికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ అందించారు. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ టీకా గణాంకాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,00,45,178 మందికి కరోనా వ్యాక్సిన్ డోసలు అందించారు. 2,61,09,999 మందికి మొదటి డోసు పూర్తికాగా.. 1,39,35,179 మందికి రెండో డోసుల వ్యాక్సిన్ పూర్తయింది. సీఎం కేసీఆర్ సహాకారం, గైడెన్స్  వల్లే ఇది సాధ్యమైందని సీఎస్ అన్నారు. ఈ ఘనత సాధించినందుకు వైద్య సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. వచ్చెనెలలో మరో కోటి డోసులు పూర్తి చేస్తామని వెల్లడించారు.

కరోనా వ్యాధి నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రభుత్వాలు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాయి. దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారందరికీ ఉచితంగా రెండు డోసుల వ్యాక్సిన్లను ఇస్తున్నారు. దేశంలో కరోనా వ్యాధిని అరికట్టేందుకు కేంద్రం హర్ ఘర్ కీ దస్తక్ అనే ప్రోగ్రాం ద్వారా ప్రతీ ఇంటికి వెళ్లి స్వయంగా వ్యాక్సిన్లను చేస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ప్రస్తుతం ఓమిక్రాన్ నేపథ్యంలో మరోొసారి వ్యాక్సినేషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోసారి అన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాలను పెంచాయి. తెలంగాణలో వ్యాక్సిన్ వేసుకోనివారికి కరెంట్ కట్ చేస్తామని, రేషన్ కట్ చేస్తామని భయపెట్టి మరీ వ్యాక్సినేషన్ వేసుకునేలా చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version