హైదరాబాద్ : ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కూరుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈ రోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం పేర్కొంది.
హైదరాబాద్ లో రాగల 48 గంటల పాటు విస్తారంగా వర్షాలు కూరుస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. హైదరాబాద్ నగరంలో నిన్న ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు, పలు ప్రధాన రోడ్లు జలమయం అయ్యాయి. అలాగే ఎక్కడికక్కడ రోడ్ల మీద నిలిచిపోయింది ట్రాఫిక్. అటు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని హైదరాబాద్ పోలీసులు సూచనలు చేస్తున్నారు. ఇవాళ కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు.