ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిఆర్ఎస్ ఉద్యమాల నుండి వచ్చిన పార్టీ అని చెప్పుకోవడం మాత్రమే ఉందని తమ పరిపాలనలో ఒక్కసారైనా ఒక అమరుడి కుటుంబం నుంచి ఎవరినైనా ప్రగతి భవన్ కి పిలిచారా అని ప్రశ్నించాడు. వాళ్ల త్యాగం గుర్తించి ఒక్కసారి ఆయన బుక్కడ బువ్వ పెట్టారా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.
తన బంధువులకి మరీ కుటుంబ సభ్యులకు మాత్రమే పదవులు ఇచ్చాడని తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకున్న ఏ ఒక్క కుటుంబానికి ఏమి చేయలేదని ప్రశ్నించాడు. మందులను బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్న వ్యాపారులను రాజ్యసభ కు పంపిన చరిత్ర మీదని దుయ్యబట్టాడు. నలిని డిఎస్పీగా ఉండి తెలంగాణ ఉద్యమం కోసం తన పదవికి రాజీనామా చేసినప్పటికీ తనని పిలిచి ఉద్యోగం ఇచ్చిందా లేక ఏదైనా న్యాయం జరిగిందా అని ప్రశ్నించాడు.తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయకపోగా… తన కూతురు నిజాంబాద్ లో ఓడిపోతే ఎమ్మెల్సీ పదివి ఇచ్చిన పార్టీ వాళ్లదని విమర్శించాడు.