ఖాతాదారులకు షాక్.. రేపటి నుంచి బ్యాంకులకు 5 రోజుల పాటు సెలవులు

-

బ్యాంకు ఖాతాదారులకు బిగ్ షాక్ తగలనుంది. బ్యాంకులకు వరుసగా ఐదు రోజుల సెలవులు రానున్నాయి. ఏప్రిల్ మాసంలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు వరుసగా ఐదు రోజుల సెలవులు ఉన్నాయి. అందువల్ల మీకు బ్యాంకు లో ఏదైనా పని ఉంటే… దానిని ఇవ్వాలే పూర్తి చేసుకోవడం ఉత్తమం. లేదంటే మీ ఆర్థిక లావాదేవీలకు బ్రేక్ పడుతుంది. అసలు బ్యాంకులకు ఎప్పుడు సెలవులు ఇప్పుడు తెలుసుకొందాం.

ఏప్రిల్ 1 – యానివల్ క్లోజింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ (దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్ ఉంటాయి)
ఏప్రిల్ 2 -ఉగాది పర్వదినం (రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు)
ఏప్రిల్ 3 – ఆదివారం
ఏప్రిల్ 4 – సర్హుల్ (రాంచీలో బ్యాంకు సెలవు)
ఏప్రిల్ 5 – బాబు జగ్జీవన్ రామ్ (తెలంగాణలో బ్యాంక్ హాలిడే)

ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో కచ్చితంగా నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. కాబట్టి.. ఖాతాదారులు ఏదైనా బ్యాంకు లావాదేవీలు ఉన్నచో… ఇవ్వాలనే పూర్తి చేసుకోవడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news