తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, తెలంగాణ ప్రభుత్వం తాజాగా MSME లకు రూ. 600 కోట్లు విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత MSME లకు సబ్సిడీల రూపంలో మొత్తం రూ.6,837 కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. వీటిద్వారా దాదాపు 90,000 మందికి లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. త్వరలో మరో రూ. 400 కోట్లు విడుదల చేస్తామని తెలిపింది.