రాష్ట్రవ్యాప్తంగా 86 ఆసుపత్రులు సీజ్ !

-

రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 1569 ఆసుపత్రులలో తనిఖీలు జరిపారు. 86 వాసుపత్రులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మరో 416 ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. వసతులు సరిగా లేని 64 ఆసుపత్రులపై జరిమాణాలు విధించారు. ముఖ్యంగా అర్హత లేని డాక్టర్లతో కొనసాగిస్తున్న వాటికి నోటీసులు జారీ చేశారు.

రెండు వారాలలోగా సమాధానం చెప్పాలని కోరారు. అనుమతి లేకుండా ఆసుపత్రులను నిర్వహించినా.. పారిశుధ్యం లోపించినా నోటీసులు జారీ చేసి, సీజ్ చేస్తామని హెచ్చరించారు. అర్హత లేని వారు వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి, సంబంధిత ఆసుపత్రిని సిస్ చేస్తామని హెచ్చరించారు. కాగా రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు, ల్యాబ్స్ లో ముమ్మర తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news