తెలంగాణలో విషాదం..వడదెబ్బతో కానిస్టేబుల్ మృతి

-

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు భగభగమంటున్నాయి. మొన్నటి వరకు వర్షాలు పడినప్పటికీ… ఇప్పుడు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో జనాలు విలవిలలాడుతున్నారు. బయట అడుగుపెట్టాలంటేనే.. వనికి పోతున్నారు. అయితే తాజాగా ఈ ఎండ… ఫోన్ నిండు ప్రాణాన్ని తీసేసింది.

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో విషాదం చోటుచేసుకుంది. వడదెబ్బ తగిలి పోలీస్ కానిస్టేబుల్ సంతోష్ కుమార్ మరణించారు. నిన్న మధ్యాహ్నం ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ రాత్రి 11 గంటలకు మరణించారు. 2000వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన ఈయన రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version