మీరు బిర్యానీ ప్రియులా? అందులో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బావర్చి హోటల్ లో బిర్యానీ అంటే పడి చచ్చిపోతారా? అయితే.. మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే..ఈ బావర్చి హోటల్ లో బిర్యానీలో ఏదెదో కలుపుతున్నారు. తాజాగా బావర్చి బిర్యానీలో టాబ్లెట్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి వైరల్ వీడియో గా మారింది.
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావర్చి రెస్టారెంట్ లో.. బిర్యానీ ఆర్డర్ చేశాడు ఓ కస్టమర్. బిర్యానీలో టాబ్లెట్ చూసి సిబ్బందిని నిలదీశాడు కస్టమర్. దీంతో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై అధికారులు చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ మధ్య కాలంలోనే… ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావర్చి రెస్టారెంట్ లో.. ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.