పుల్లారెడ్డి కొడుకు రాఘవరెడ్డికి షాక్.. ఇంట్లో నిర్మించిన అడ్డుగోడని తొలగించిన అధికారులు

పుల్లారెడ్డి కొడుకు రాఘవరెడ్డి కి షాక్ ఇచ్చింది న్యాయస్థానం.ఇంట్లో నిర్మించిన అడ్డుగోడను తొలగించారు అధికారులు.కోడలు ఇంట్లోకి రాకుండా అడ్డుగోడ నిర్మించారు రాఘవ రెడ్డి.కోర్టు ఆదేశాలతో అడ్డుగోడను తొలగించారు.న్యాయాస్థానం ఆదేశాల మేరకు పుల్లారెడ్డి నివాసంలో నిర్మించిన గోడను తొలగించినట్లు హైదరాబాద్ జిల్లా ప్రొటెక్షన్ అధికారి అకేశ్వర రావు తెలిపారు.ఉదయం 9 గంటలకు ఏక్ నాథ్ రెడ్డి ఇంటీకి చేరుకున్న ప్రొటెక్షన్ అధికారిని అనిత రెడ్డి,ఆ సమయంలో పుల్లారెడ్డి నివాసానికి చేరుకున్న రాఘవరెడ్డి తరపు న్యాయవాదిగోడ కూల్చే విషయంలో పునర్ ఆలోచించుకోవాలని గతంలో ఇచ్చిన కోర్టు ఆదేశాలను చూపించారు న్యాయవాది.

 

పరిశీలించిన అధికారులు అనంతరం జిల్లా ప్రొటెక్షన్ అధికారి సమాచారం అందించారు ప్రొటెక్షన్ అధికారిణి.పుల్లారెడ్డి ఇంటికి చేరుకునీ అడ్డుగా ఉన్న గోడను తొలగించారు జిల్లా ప్రొటెక్షన్ అధికారి అక్కేశ్వరరావు.న్యాయస్థానం ప్రజ్ఞా రెడ్డి ఫిర్యాదు మేరకు ఇంటిలో స్వేచ్ఛగా తిరిగేందుకు అడ్డుగా ఉన్న గోడను తొలగించమని కోర్ట్ ఆదేశాలు జారీ చేసిందని జిల్లా ప్రొటెక్షన్ అధికారి తెలిపారు.ఆ ఆదేశాలను మాత్రమే తాము అమలు చేసినట్లు చెప్పారు జిల్లా ప్రొటెక్షన్ అధికారి.