కేటీఆర్ బామ్మ‌ర్ది డ్ర‌గ్స్ పార్టీలో బిగ్ ట్విస్ట్…కేసినో, బెట్టింగ్స్ కూడా!

-

జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీలో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీలో భారీగా కేసినో బెట్టింగ్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్, లిక్కర్, పేకాట బెట్టింగ్ తో భారీగా రేవ్ పార్టీ నిర్వహించారట. ఆ ఫాంహౌజ్‌లో అర్ధరాత్రి పార్టీలు నిత్యకృత్యమని సాధారణం అని స్థానికులు చెబుతున్నారట.

A twist on the Janwada Farm House Rave Party

కేటీఆర్ బావమరిది డ్రగ్స్ పార్టీ జరుగగా.. ఖరీదైన లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీంతో కేటీఆర్ బావమరిదిపై కేసు నమోదు అయింది. ఇక ఈ రేవ్ పార్టీపై బండి సంజయ్ స్పందించారు.

కేటీఆర్‌ బామ్మర్ది ఫాంహౌజ్‌లోనే రేవ్ పార్టీ నిర్వహించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. సుద్దపూస కేటీఆర్.. ఇప్పుడేమంటాడో..?అంటూ చురకలు అంటించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. బామ్మర్ది ఫాంహౌజ్‌లోనే రేవ్ పార్టీలా? డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో..? అంటూ ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version