Telangana: ట్రాన్స్‌జెండర్‌తో యువకుడి ప్రేమ వివాహం

-

పెళ్లి… ఓ నూరేళ్ల అనుబంధం. కొంతమంది అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నవారి కంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నవారు ఈ మధ్యలో ఎక్కువ ఉంటున్నారు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో వింత పెళ్లి జరిగింది. ట్రాన్స్ జెండర్ ను ఓ యువకుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.

A young man’s love marriage with a transgender

ఈ సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. నక్షత్ర అనే ట్రాన్స్ జెండర్… ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన నందు కొంతకాలంగా సోషల్ మీడియాలో వేదికగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ట్రాన్స్ జెండర్ సంఘం సభ్యులకు తెలుపగా…. ఏనుకూరు మండలంలోని గార్ల ఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడిలో వారిద్దరికీ ఆదివారం పెళ్లి జరిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version