ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బెయిల్ పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది ఏసీబీ కోర్టు. ప్రభుత్వ తరపు లాయర్ వాదనాలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. దర్యాప్తు సమయంలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే కేసును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.

మరోవైపు ఇదే ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ పై పిటి వారెంట్ కోరారు పోలీసులు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు పిటి వారెంట్ దాఖలు చేశారు. నందకుమార్ పై బంజారాహిల్స్ పిఎస్ లో మరో రెండు కేసులలో నిందితుడిగా ఉన్నాడు. అయితే పోలీసులు వేసిన పీటీ వారెంట్ కు నాంపల్లి కోర్టు అనుమతిస్తే.. నిందితుడు నందకుమార్ను అరెస్టు చేసి తిరిగి కోర్టులో హాజరు పర్చనున్నారు బంజారాహిల్స్ పోలీసులు.