BREAKING : బీజేపీ పార్టీలో చేరనున్న సినీ నటి జయసుధ !

-

BREAKING : సినీ నటి, రాజకీయ నాయకులు జయసుధ.. బీజేపీ పార్టీలో చేరనున్నట్లు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధతో బీజేపీ పార్టీ సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం అందుతోంది. బీజేపీలో చేరాలని ఇప్పటికే కోరారు బీజేపీ పార్టీ నేతలు.

గతంలో సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గా గెలిచిన జయసుధ..బీజేపీ పార్టీలో చేరే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలలో పోటీ చేసే ఆలోచనలో జయసుధ లేరని సమాచారం అందుతోంది. తాను ఇప్పుడు సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉంటూ.. రెస్ట్‌ తీసుకోవాలని అనుకుంటున్నట్లు బీజేపీ అగ్ర నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా.. గతేడాది.. సినీ గ్లామర్‌ ఉన్న విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులపై ఎక్కువగా ఇంట్రెస్ట్‌ చూపే బీజేపీ.. అందులో భాగంగానే.. జయసుధను కూడా ఆహ్మానించారు.

Read more RELATED
Recommended to you

Latest news