వాపును చూసి బలుపు అనుకుంటే ఎలా..? కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ఏపీ మంత్రులు కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఏపీలో కరెంట్, నీటి సమస్యలు ఉన్నాయని, రోడ్లు బాగా లేవని మంత్రి కేటీఆర్ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. కేటీఆర్ ఏపీ గురించి ఈ వ్యాఖ్యలు చేసి ఉండకపోవచ్చని.. ఒక వేళ ఏపీ గురించే వ్యాఖ్యానిస్తే వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాపును చూసి బలపు అనుకుంటే ఎలా..? అంటూ వ్యాఖ్యానించారు. ఏపీ గ్రామాల్లో జరుగుతున్న డెవలప్మెంట్ ను, వాలంటరీ వ్యవస్థను చూడాలని అన్నారు. దేశంలో 16 రాష్ట్రాల్లో కరెంట్ కట్స్ ఉన్నాయని ఆయన అన్నారు. మేం దేనికైానా సిద్ధం అని.. మా రాష్ట్రంలో ప్రగతి, డెవలప్మెంట్ ను చూస్తామన్న, మా పరిపాలనను చూస్తామన్న సిద్ధం అని అన్నారు. గత ప్రభుత్వాాల నిర్ణయాల వల్ల కొన్ని నష్టాలని ఆయన అన్నారు. తెలంగాణలో పవర్ కట్స్ లేవా అని ప్రశ్నించారు. పక్కల వాళ్లను కించపరిస్తే మన వాల్యూ పెరుగుతుందనుకోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఈ రకమైన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news