తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయ వనరులను సమకూర్చుకోవడానికి, సంక్షేమ పథకాలను సవ్యంగా నడిపించేందుకు మరో ముందడుగు వేసింది కేసీఆర్ సర్కార్. తాజాగా ప్రభుత్వ భూములను వేలం వేయడానికి తెలంగాణ సర్కార్ మరోసారి సిద్ధమైంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 37 ఫ్లాట్లకు వేలం నిర్వహించనున్నారు. శేరిలింగంపల్లి, అర్సిపురం, అమీన్పూర్, గండిమైసమ్మ ప్రాంతాలలో భూములు అమ్మకానికి ఉంచారు. జనవరి 18న HMDA ఈ వేలం నిర్వహించనుంది. కాగా, గతంలో కూడా ప్రభుత్వ భూములను కేసీఆర్ సర్కార్ వేలం వేసిన సంగతి తెలిసిందే.