నేను తాంబాకు తిన్నట్టు ఆధారాలు బయట పెట్టు – కేటీఆర్ కు బండి కౌంటర్

-

నిన్న కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్‌ ఇచ్చారు. దొంగలు బడ్డ ఆరునెలలకు ఇప్పుడు మెరగడం ఎందుకన్నారు. ఎప్పుడో పిసిసి అధ్యక్షుడు సవాల్ చేస్తే ఇప్పుడు టెస్టులకు రెడీ అంటున్నాడు.. అన్ని టెస్టులకు ప్రిపేర్ ఆయి టెస్ట్ కి రెడీ అంటుండని వెల్లడించారు.

కేటీఆర్ పేరు మీద కామెంట్ చేయొద్దని ఆర్డర్ తెచ్చాడని.. నేను తాంబాకు తిన్నట్టు ఆధారాలు ఉన్నాయా ? అని నిలదీశారు. లిక్కర్ కేసు గురించి ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి కాక ముందే ఇలా మాట్లాడితే తెలంగాణ లో పేదోళ్ల పరిస్థితి దారుణం అవుతదని.. మీ భాష చూసి నవ్వుకున్నామన్నారు.

ఢిల్లీలో తీగ లాగితే ఇక్కడ భయం మొదలయిందని.. హైదరాబాద్ డ్రగ్స్ కేసు కుంజితే కొడుకు విషయం తెలుస్తదని విచారణ మూసేసారని పేర్కొన్నారు. బూతులు తిట్టడం తప్ప ఏముంది మీరు చేసిందని.. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. తప్పు చేయనప్పుడు కోర్టు ముందు నిరూపించుకోవచ్చని..కెసిఆర్ అభివృద్ధి ఏమి చేసిండో ప్రకటించన్నారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news