తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరవ విడత ప్రజా సంగ్రామ యాత్ర సంక్రాంతి తర్వాత కొనసాగా అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా లేదా కొడంగల్ – నిజామాబాద్ మార్గంలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతుంది.
ఒకవేళ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంటే, బండి సంజయ్ బస్సు యాత్ర చేయనున్నారని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లోనే బండి సంజయ్ బస్సు యాత్ర కొనసాగనుoదట.