నువ్వు చేసేది బ్రోకరిజం, పాస్ పోర్ట్ బోకర్ వి నువ్వు… కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ఓట్లు కొంటున్నావు, ఎమ్మెల్యేలను కొంటున్నావు మరి ధాన్యం కొనడానికి నీకేం ఇబ్బంది అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. రైతులను అరిగోస పెట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఏడేళ్ల నుంచి ప్రతీ గింజ నేనే కొంటా అని అన్న ముఖ్యమంత్రి ఇప్పుడెందుకు కొంటలేరని ప్రశ్నించారు. ధాన్యం కొంటాం అన్నిది మేమే కొనేది మేమే అని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఏడేళ్లుగా కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని అన్నారు. కేంద్రాని, బీజేపీకి రైతులు మద్దతు పలుకుతారనే రాజకీయ స్వార్థం కోసం రైతులను సీఎం వాడుకుంటున్నారని విమర్శించారు.

 మేం పక్కా కొంటాం.. నువ్వు కొనిస్తావా..? నువ్వు చేసేది బ్రొకరిజం అని పాస్ పోర్ట్ బ్రోకర్వి అని సీఎం కేసీఆర్ గురించి సంచలన విమర్శలు చేశారు బండి సంజయ్. ఈ సారి ధాన్యం ఇవ్వమని కేంద్రానికి లేఖ ఇచ్చింది సీఎం కేసీఆర్ అని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని రైతులను నట్టేట ముంచింది సీఎం కేసీఆర్ అని విమర్శిమచారు. ఓసారి సన్నవడ్ల వేయద్దు అని… ఓ సారి పత్తి వేయమని రైతులను కేసీఆర్ మోసం చేశాడని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటల మద్దతు ధర పెరిగిందని గుర్తు చేశారు.