త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది-బండి సంజయ్‌

-

త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని..ఆ అవకాశాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్‌. కరీంనగర్ లో ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన బండి సంజయ్ ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని హాట్‌ కామెంట్స్‌ చేశారు బండి సంజయ్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు..కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని ఆరోపణలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చన్నారు. కేసీఆర్ కి ప్రజాస్వామ్యం పై నమ్మకంలేదు… కుట్రలకు కేరాఫ్ కేసీఆర్ అని ఫైర్‌ అయ్యారు.

bandi sanjay comments on revanth govt

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ను బొంద పెడదామని… కేసీఆర్ కదలికలపై కాంగ్రెస్ వాళ్లు ఓ కన్నేసి ఉంచండని కోరారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే బీజేపీ ఎక్కువ సంఖ్యలో ఎంపీలు గెలవాలని…కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావలన్నా బీజేపీ గెలవాలని సెటైర్లు పేల్చారు. యాదాద్రి ని వ్యాపార కేంద్రంగా మార్చింది కేసీఆర్ అని… యాదాద్రిలో కేసీఆర్ తన బొమ్మ చెక్కించుకున్నాడని ఆగ్రహించారు బండి సంజయ్‌. బీఆర్ఎస్ తెలంగాణ పదాన్ని వదులుకుంది… అది ప్రాంతీయ పార్టీనా.. జాతీయ పార్టీనా? అంటూ నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version