ఉక్రెయిన్‌- రష్యా యుద్దాన్ని ఆపింది మోడీనే – బండి సంజయ్‌ వీడియో వైరల్‌

ఉక్రెయిన్‌- రష్యా యుద్దాన్ని ఆపింది ప్రధాని మోడీనేనని బండి సంజయ్‌ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ తెలంగాణ పర్యటన లో భాగంగా హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ… ఉక్రెయిన్‌- రష్యా యుద్దాన్ని ఆపింది ప్రధాని మోడీనేనని అంటూ వ్యాఖ్యానించారు.

అయితే…బండి సంజయ్‌ అన్న ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. అటు మంత్రి కేటీఆర్‌ కూడా బండి సంజయ్‌ వీడియోను షేర్‌ చేసి.. కౌంటర్‌ ఇచ్చారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలకు మూలం వాట్సాప్ యూనివర్సీటీ అంటూ సెటైర్లు పేల్చారు. ఇది ప్రతిభావంతులైన విద్యార్థులు మాట్లాడే మాటలని… అందు లోనూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడటం విడ్డూరం అంటూ ట్వీట్‌ చేశారు మంత్రి కేటీఆర్‌. ఏది ఏమైనా.. బండి సంజయ్‌ కుమార్‌ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌ గా మారాయి.