తెలంగాణ బీజేపీ పార్టీ లో గత 10 రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. కిషన్ రెడ్డికే కేంద్ర మంత్రితో పాటు అధ్యక్ష పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు పై పార్టీ లో చర్చ, రచ్చ జరుగుతోంది. అధ్యక్ష మార్పు తథ్యమని విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికే పార్టీ పగ్గాలు అప్పగించేందుకు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అధ్యక్ష పదవి చేపట్టినా… కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కొనసాగనున్నారని టాక్ వినిపిస్తోంది. బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి లేదా పార్టీ జాతీయ కమిటీ లో చోటు ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈటెల రాజేందర్ కి ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు ఇవ్వాలని.. అధ్యక్ష మార్పు ఉండొచ్చని అంటున్నారు. అటు ఏ పదవి వద్దని బండి సంజయ్ అంటున్నారట. ఈ టైమ్ లో పార్టీ అధ్యక్షన్ని మారిస్తే, పార్టీ పై దుష్ప్రభావం పడుతుందని కొంత మంది బీజేపీ నేతలు అంటున్నారట.