యాదాద్రి జిల్లా మోత్కూర్ లో బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఈడి ని వాడుకోవాలని చూస్తే తెలంగాణ లో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలడని హెచ్చరించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాతో టచ్ లో ఉన్నాడని నేను ఎప్పుడు అనలేదు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చాలా మంచి పొలిటికల్ లీడర్ అని కొనియాడారు. మునుగోడు ఉప ఎన్నిక నుండి కాంగ్రెస్, టీఆరెఏస్ ఎప్పుడో పారిపోయాయి.. కమ్యూనిస్టు లు ఎప్పుడు పోతారో చూడాలన్నారు.
కమ్యూనిస్టులు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదని చురకలు అంటించారు. దుబ్బాక లో కాంగ్రెస్ క్యాడర్ బీజేపీ కి సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని నిప్పులు చెరిగారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ని ఎప్పుడు విమర్శించలేదు .. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ని మాత్రమే విమర్శించాడని పేర్కొన్నారు.
కేసీఆర్ బొమ్మ పెట్టుకొని తిరిగితే ఓట్లు పడే రోజులు ఎప్పుడో పోయాయని.. టీఆరెస్ ఎమ్మెల్యే లు, మంత్రులు లైసెన్సుడ్ గుండాలు అయిపోయారని ఆగ్రహించారు. మంత్రులు గాల్లోకి కాల్పులు జరుపుతుంటే రజాకార్ల పాలన మళ్ళీ వచ్చిందా అనిపిస్తుంది.. తెలంగాణ లో టిఆర్ఎస్ పార్టీ కి అనుసంధానంగా ఉన్న అధికారుల లిస్ట్ రెడీ చేస్తున్నాం, అధికారం లోకి వచ్చాక వాళ్ళ సంగతి చెప్తామని వార్నింగ్ ఇచ్చారు.