సీఎం కెసిఆర్ కు సన్ స్ట్రోక్ గ్యారంటీ -బండి సంజయ్

-

మూడో ప్రజా సంగ్రామ యాత్ర తర్వలోనే ఉందని.. సీఎం కెసిఆర్ కి సన్ స్ట్రోక్ గ్యారంటీ.. ప్రభుత్వానికి కూడ సన్ స్ట్రోక్ గ్యారంటీ అంటూ బండి సంజయ్ చురకలు అంటించారు. ప్రధాని అని మర్చిపోయి కేటిఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని ఫైర్ అయ్యారు. అన్ని సర్వే సంస్థలో కాంగ్రస్, టిఆర్ ఎస్ కి ఎక్కడ స్థానాలు లేవు…బీజేపీ కి అనుకూలంగా ఉన్నాయన్నారు.

జీతాలు ఇవ్వలేని, పెన్షన్స్ ఇవ్వాలేని పరిస్థితి తెలంగాణ లో వచ్చింది…కానీ శ్రీలంక పరిస్థితి రావద్దని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది…కానీ కేసీఆర్ ప్రభుత్వానికి సిగ్గు లేదు, అభివృద్ధి కి సహకరించడం లేదని ఫైర్‌ అయ్యారు. కేంద్రాన్ని బదనాం చేయడం పనిగా పెట్టుకున్నారని… డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ప్రజలు కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. కేంద్ర సర్కార్ వ్యాట్ టాక్స్ తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడం లేదు.. ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news