బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ వర్గాల గొడవ !

-

తెలంగాణ బీజేపీ పార్టీలో గొడవలు రోజుకు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. బండి సంజయ్‌ మరియు ఈటల రాజేందర్‌ మధ్య కోల్డ్‌ వార్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా నాంపల్లి బీజేపీ ఆఫీసులో బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుందని సమాచారం అందుతోంది.

గతంలో కాంగ్రెస్ తరపున, చిరంజీవి దగ్గర కూడా పనిచేసిన ఓ వ్యక్తి గత కొంతకాలంగా బీజేపీకి కాంట్రాక్ట్ మీద పని చేస్తూ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితం మధ్య ‘చేరికల కమిటీ చైర్మన్ ఈటెల’ అంటూ వ్యంగగా పోస్టింగులు పెడుతుండగా సమయం కోసం ఎదురు చూసింది ఈటల రాజేందర్‌ వర్గం. ఇక 2 రోజుల క్రితం నాంపల్లి ఆఫీసులో జరిగిన గొడవలో ఆ వ్యక్తిని ఈటల రాజేందర్‌ ప్రధాన అనుచరుడు, మేడ్చల్ జిల్లా బీజేపీలో కీలక పదవిలో ఉన్న ఓ నేత మెడ పట్టి బైటికి గెంటేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోంది. అయితే.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news