బ‌స్తీ ద‌వాఖానా పేదోడికి వ‌ర‌మా !

-

తెలంగాణ స‌ర్కారు మ‌రో మంచి నిర్ణ‌యం వెలువ‌రించింది.ఇప్ప‌టిదాకా హైద్రాబాద్ ప‌రిస‌రాల్లో 256 బ‌స్తీ ద‌వాఖానాలు  ఏర్పాటు చేసి,పేద‌ల‌కు సులువుగా,చేరువుగా వైద్యం అందేందుకు చ‌ర్య‌లు తీసుకుంది.

ఇవ‌న్నీ  మ‌రింత మంచి ఫ‌లితాలు సాధించే దిశ‌గా కృషి చేయాల‌ని ప్ర‌భుత్వం సంకల్పిస్తోంది.వీటితో పాటు హెచ్ఎండీఏ ప‌రిధిలో మ‌రో 94 బ‌స్తీ ద‌వాఖానాలు ఏర్పాటుకు తెలంగాణ ప్ర‌భుత్వం సంక‌ల్పించింది. ఇవే కాకుండా మున్సిప‌ల్ కార్పొరేష‌న్లు,మున్సిపాల్టీల ప‌రిధిలో 60 బ‌స్తీ ద‌వాఖానాలు నెల‌కొల్పేందుకు సిద్ధం అవుతున్నామ‌ని ప్ర‌భుత్వం అంటోంది.అంతేకాక ఇవాళ్టి బ‌డ్జెట్లో కూడా ఆరోగ్యానికి కేటాయించిన నిధులు కూడా గ‌తం క‌న్నా పెర‌గ‌డ‌మే కాదు అనూహ్య రీతిలో ఈ రంగానికి  ప్ర‌భుత్వం ప్రాధాన్యం ఇవ్వ‌డం కూడా బాగుంద‌ని తెలంగాణ రాష్ట్ర స‌మితికి చెందిన వ‌ర్గాలు ఆనందిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news