కేసీఆర్ ప్రభుత్వంలో బీసీలు ధైర్యంగా ఉన్నారు – మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామం లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వాయి పాపన్న గౌడ్ గౌడ కులస్థులకు మాత్రమే కాదు అన్ని కులాల కోసం కొట్లాడిన వ్యక్తి అన్నారు. సమాజంలో జరుగుతున్న అరాచకాలను చూడలేక పోరాడి 33 కోటలను జయించిన మహనీయుడు సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.

సర్వాయి పాపన్న చరిత్రను అనాడు రాయలేదని.. లండన్ కేంబ్రిడ్జ్ లో సర్వాయి పాపన్న గురించి రాశారన్నారు. సర్వాయి పాపన్న దక్షిణ ఆసియా ఖండంలోనే గొప్ప వీరుడన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో బీసీలు ధైర్యంగా ఉన్నారని తెలిపారు. అధికారులు దగ్గర ఉండి నాలుగు కోట్లకు పైగా తాటి మొక్కలను పెట్టించామన్నారు. అన్ని కుల వృత్తులను కాపాడుకుంటాం అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు మంత్రి. ప్రతి కులానికి, ప్రతి వర్గానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version