BREAKING: భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి ప్రవాహం

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో భద్రాచలం వద్ద మళ్లీ గోదావరి స్వల్పంగా పెరుగుతుంది. ఎగువన కురిసిన వర్షాల వల్ల మళ్ళీ గోదావరి ఇన్ ఫ్లో బాగా పెరిగాయి. నిన్న ఉదయం వరకు తగ్గుతూ వచ్చిన గోదావరి నిన్న సాయంత్రం నుంచి మళ్లీ పెరగడం ప్రారంభించింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 49.10 అడుగుల వద్ద గోదావరి ఉన్నది.

ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. గత నెల నుంచి గోదావరికి భారీ ఎత్తున వరదలు వచ్చిన విషయం తెలిసిందే. జూలై నెలలో 71.3 అడుగులు భద్రాచలం వద్ద గోదావరి వచ్చింది. దీని వల్ల పినపాక ,భద్రాచలం నియోజకవర్గం తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాలోని అనేక గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఇప్పటికీ ఏపీలోని గ్రామాలు ఇంకా కోలుకోలేదు.

గోదావరి పెరుగుతూ తగ్గుతూ ఉంది .పూర్తి స్థాయిలో గోదావరి నీటిమట్టం తగ్గలేదు దీంతో గోదావరి ప్రభావిత ప్రాంతంలో ప్రజల్లో ఆందోళన కొనసాగుతుంది. మహారాష్ట్రలోని 28 జిల్లాల్లో నిన్న కురిసిన వర్షాల వల్ల గోదావరికి వరద వస్తున్నట్లుగా సి డబ్ల్యూ సి అధికారులు చెబుతున్నారు .ఇది మరో రెండు రోజులు ఈ గోదావరి ఇలానే ఉంటే అవకాశాలు ఉన్నా యని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news