జూబ్లిహిల్స్ హౌజింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

-

జూబ్లిహిల్స్ హౌజింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీకి తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేనేజింగ్ కమిటీ తెచ్చుకున్న అక్రమ జీఓపై తెలంగాణ హైకోర్టు…తాజాగా స్టే ఇచ్చింది. కోరం లేకుండా మేనేజింగ్ కమిటీ ఏక పక్ష నిర్ణయాలు తీసుకునేలా ఇటివలే జూబ్లిహిల్స్ హౌజింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ… జీఓ (జీఓ నంబర్ 247 dt.9.6.2022)ను తీసుకొచ్చింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అక్రమ జీఓ పై హైకోర్టును ఆశ్రయించారు జూబ్లీ హిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షుడు సివి రావు. ఈ తరుణంలోనే సివి రావు వేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. మేనేజింగ్ కమిటీ సొసైటీ లో అక్రమ చర్యలకు పాల్పడవద్దoటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హౌజింగ్ సొసైటీ సభ్యులను తొలగించడం, సభ్యత్వాలను బదిలీ చేయడం, అర్హత లేనివారికి సభ్యత్వాలు కట్టబెట్టొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news