తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీజేపీ

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది బీజేపీ పార్టీ. ఈ మేరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటన చేశారు. కాంగ్రెస్ శాసన సభ సంప్రదాయం ను కాల రాసింది..పాత అలవాటు ను కొనసాగించిందని మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ తో చేసుకున్న ఒప్పందం మేరకు ఆ పార్టీ కి చెందిన అక్బరుద్దీన్ ను ప్రోటెం స్పీకర్ చేశారని కిషన్‌ రెడ్డి ఆగ్రహించారు.

BJP boycotted Telangana assembly meetings

కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా దగ్గిన కూలిపోయే ప్రమాదం ఉంది… అందుకే mim ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. సీనియర్ లను పక్కన పెట్టీ mim అక్బరుద్దీన్ ఓవైసీని… ప్రోటెం స్పీకర్ చేయడాన్ని మేము ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ కు MIM పార్టీకి లోపాయకార ఒప్పందం బయడ పడిందన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. Mim, బీజేపీ ఒకటి అని దుష్ప్రచారం చేశారు…సీనియర్ లను కాదని దొడ్డిదారిన అక్బరుద్దీన్ ను ప్రోటెం స్పీకర్ చేశారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version