బీజేపిని, మోడీని చూసి కేసీఆర్ భయపడుతున్నారన్నారు బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్. బిజెపి పార్టీ ఎదుగుదలను కేసీఆర్ చూసి తట్టుకోలేకపోతున్నారు… జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత రాష్ట్రంలో బిజెపికి కొత్త ఉత్సాహం వచ్చిందని విమర్శలు చేశారు. బిజెపి పార్టీ ఎదుగుదలను చూసి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదు… మోడిపై కేసిఆర్ చేసిన వ్యాఖ్యలు, వాడిన పదజాలం, భాషను ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కుటుంబంపాలన కొనసాగుతుంది… ఆ ఒక్క కుటుంబమే అభివృద్ధి చెందింది….“బంగారు తెలంగాణ” చేస్తానన్న కేసీఆర్ “అవినీతి తెలంగాణ” గా మార్చారని మండిపడ్డారు. చందమామపై ఉమ్మితే మన మీదనే పడుతుందని కేసీఆర్ గ్రహించాలి. దేశంలో ఎక్కడా లేనివిధంగా డీజిల్, పెట్రోల్ ధరలు తెలంగాణలో ఉన్నాయని ఆగ్రహించారు బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్. కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు డీజిల్, పెట్రోల్ ధరలపై పన్నులు తగ్గించింది… రాష్ట్రంలో కెసిఆర్ కి ప్రజలు “బాయ్..బాయ్” చెప్తారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బిజేపి విజయం సాధించడం ఖాయం. తెలంగాణ లో బిజెపి అధికారంలోకి రావడం తధ్యమన్నారు బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్.