కాజీపేటలో రైలు ఎక్కి సెల్ఫీలు.. హై టెన్షన్ వైర్స్ తగిలి..?

-

ఈ మధ్య కాలంలో యువతకు సెల్ఫీలు, రీల్స్ పిచ్చి ఎంత పట్టిందో అందరికి తెలిసిందే. తమకు ఎక్కువ లైక్స్ రావాలని.. ఎక్కువ వ్యూస్ రావాలని తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా వింత వింత స్టాంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అలాంటి ఓ సెల్ఫీ పిచ్చే ప్రాణాల పైకి తెచ్చింది. కాజీపేట కడిపికొండ రాంనగర్ సమీపంలోని ర్తేల్వే ట్రాక్ పై ఆగివున్న గూడ్స్ రైలు మీద ఎక్కి సెల్ఫీలు దిగుతూ రీల్స్ చేస్తున్న క్రమంలో హై టెన్షన్ కరెంట్ వైర్స్ తగిలి పాస్టర్ రాజ్ కుమార్ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.

హై టెన్షన్ కరెంట్ వైర్స్ తాకడంతో 70% కాలిన గాయాలతో అతడిని 108 ద్వారా ఎంజీఎం కు తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడికి వైద్యం అందిస్తున్నారు ఎంజీఎం వైద్యులు. అయితే ఎక్కువ శాతం చర్మ కాలిపోవడంతో ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version