BREAKING: రేపటి నుంచి తెలంగాణలో ఫారెస్ట్ సిబ్బంది విధుల బహిష్కరణ

-

తెలంగాణ ఫారెస్ట్ సిబ్బంది సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి తాము విధులకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. పోలీసులకు ఇచ్చినట్లుగా తమకు కూడా తుపాకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఫారెస్ట్ సిబ్బంది. దీనిపై రాతపూర్వకంగా హామీ ఇస్తేనే తిరిగి మళ్ళీ విధుల్లో చేరుతామని ఫారెస్ట్ సిబ్బంది ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తి కోయిల దాడిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఫారెస్ట్ సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక శ్రీనివాసరావు అంత్యక్రియలలో మంత్రులను మొదట అటవీ సిబ్బంది అడ్డుకున్నారు. గుత్తి కోయల దాడుల నుంచి తమని రక్షించాలని కోరారు. తమపై గుత్తి కోయలు దాడులు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అటవీ అధికారులు, సిబ్బంది మంత్రుల ఎదుట వాపోయారు. దీంతో ఆయుధాల అంశంపై సీఎం కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news