తమ్ముడు తారక రామారావు.. స్టోరీలు చెప్పడం మానుకో – మధుయాష్కి గౌడ్

సీఎం కేసీఆర్ తన అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలలో భాగంగానే జాతీయ పార్టీ అంటున్నాడని ఆరోపించారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్. గురువారం గాంధీభవన్ మీడియా సమావేశంలో ఆయనన మాట్లాడుతూ.. కెసిఆర్ జాతీయ పార్టీ పెట్టిన ఒరిగేదేమీ లేదని అన్నారు. కెసిఆర్ రాజకీయంగా వేసే అడుగులన్నీ బిజెపికి ఉపయోగపడే విధంగానే ఉన్నాయన్నారు.

జాతీయ పార్టీ అంటూ కేసిఆర్.. యూపీఏ భాగస్వామ్య పార్టీల నాయకులను కలుస్తున్నాడని, బిజెపికి మద్దతుగా ఉన్న పార్టీలను, నాయకులను కలవడం లేదని ఆరోపించారు. నితీష్ కుమార్, శరత్ పవర్, స్టాలిన్ లను సీఎం కేసీఆర్ కలిశారని.. మీరంతా యూపీఏ భాగస్వామ్య పార్టీ నాయకులేనని అన్నారు. కెసిఆర్ దరిద్రపు ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఇసుక, ల్యాండ్, లిక్కర్ మాఫియాకు అడ్డాగాా మార్చాడని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ పేర్లు ఉన్నాయని వార్తలు వస్తున్నాయని అన్నారు.

బిజెపి – టిఆర్ఎస్ మధ్య వార్ నిజమే అయితే కేసీఆర్ అవినీతిపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లు కూల్చి.. 8 ఏళ్ల తర్వాత విగ్రహం పెట్టారని అన్నారు. విగ్రహం పెట్టడానికి 8 ఏళ్లు పట్టిందా? అని ప్రశ్నించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం పెట్టామని కేటీఆర్ గొప్పగా చెప్పుకుంటున్నాడని.. తమ్ముడు తారక రామారావు స్టోరీలు చెప్పడం మానుకోవాలన్నారు.