BREAKING : ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి

-

కల్వకుంట్ల ఎమ్మెల్సీ కవితకు మరో షాక్‌ తగలింది. జగిత్యాల పట్టణంలో శనివారం ఎమ్మెల్సీ కవిత పర్యటనలు అపశృతి చోటుచేసుకుంది. టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సందర్భంగా కొత్త బస్టాండ్ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట బిఆర్ఎస్ నాయకులు నృత్యాలు చేస్తుండగా మహిళా కౌన్సిలర్ బండారి రజని భర్త బండారి నరేందర్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు.

నాయకులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తోటి నాయకులు, కౌన్సిలర్లు విషాదంలో మునిగిపోయారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news