ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తూనే.. తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ సర్కారును కూల్చే కుట్ర ఎవరు చేశారో అందరికీ తెలిసిందేనని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలను జేబు సంస్థలుగా వాడుతోందని గువ్వల బాలరాజు ఆరోపించారు. విచారణ సంస్థలతో తమను ఇబ్బంది పెట్టాలని కేంద్రం చూస్తోందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తమను ఇబ్బంది పెడితే సహించేది లేదని చెప్పారు.

కేసును సీబీఐకి అప్పగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. సీబీఐకి అప్పగిస్తూ గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని.. అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?