పంటకు నీళ్లివ్వకుండా రైతులను అరిగోస పెడుతున్నారు : కొప్పుల ఈశ్వర్

-

కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అల్లాడుతున్నారని, పంటకు నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు అరిగోస తప్పడం లేదని వాపోయారు. అధికారంలోకి వచ్చాక అతి తక్కువ సమయంలో విఫలమైన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణ కాంగ్రెస్ సర్కారేనని విమర్శించారు.

లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహించిన కొప్పుల ఈశ్వర్ స్థానిక హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ప్రజలను కలుస్తూ వారికి కేసీఆర్ సర్కార్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల పాలన మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

“నేను సాధారణమైన వ్యక్తిగా 26 ఏళ్లు సింగరేణి కార్మికుడిగా పని చేశాను. స్థానిక సమస్యలపై అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. కొందరు ఆస్తులను పరిశ్రమలను రక్షించుకోవడం కోసమే పదవులను అడ్డం పెట్టుకుంటున్నారు. హైదరాబాదులో ఉండి ఇక్కడి సమస్యలను ఏ విధంగా తీరుస్తారు. అందుకే ప్రజల మధ్య ఉండే వారికే ఓటు వేయండి.” అని కొప్పుల ఈశ్వర్ కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version