బీఆర్ఎస్ దొంగలను రాష్ట్రం నుండి కాదు.. ఈ దేశం నుంచే తరిమికొట్టాలి – వైఎస్ షర్మిల

-

బిఆర్ఎస్ ప్రభుత్వం పై సోషల్ మీడియా వేదికగా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ బీఆర్ఎస్ దొంగలను రాష్ట్రం నుండే కాదు.. దేశం నుంచి తరిమి కొట్టాలని అన్నారు. “తెలంగాణ ప్రజల సొమ్ముతో మహారాష్ట్రలో బందిపోట్ల సోకు రాజకీయాలు “. తెలంగాణ ప్రజలు ఓట్లు వేసిన పాపానికి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా మహారాష్ట్ర ప్రజలకు ఊడిగం చేస్తున్నారు.

‘రాష్ట్ర ప్రభుత్వం’ మొత్తం పక్క రాష్ట్రానికి తరలిపోయింది. దొర తెలంగాణకు ముఖ్యమంత్రా? లేక మహారాష్ట్రకా? ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ప్రజల సమస్యలు పరిష్కరించకుండా.. బందిపోట్లలాగా ఇక్కడి సంపదను కొల్లగొట్టి పక్క రాష్ట్రంలో ఖర్చు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజానికం బీఆర్ఎస్ దుర్మార్గాలను గుర్తించాలి. ప్రజలను గాలికొదిలి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పక్క రాష్ట్రానికి వెళ్లిందంటే.. తెలంగాణపై కేసీఆర్ కున్న చిత్తశుద్ధి ఏంటో గమనించాలి.

వెళ్లే దారిలో కూడా ఇక్కడి ప్రజలను అవస్థలకు గురిచేసిన దొంగలు ఈ బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రంలో పాలన అటకెక్కింది, వ్యవస్థలన్నీ శూన్యం. మన గ్రామాలు సందర్శించడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి తీరిక లేదు కానీ రాజకీయాల కోసం పక్క రాష్ట్రానికి వెళ్లే సమయం మాత్రం ఉంది. ఇక్కడ తిరిగి సమస్యలు తెలుసుకోలేని బందిపోట్లు.. పక్క రాష్ట్రాల ప్రజలను ఉద్ధరిస్తామనడం ఈ దశాబ్దపు పెద్ద జోక్. తెలంగాణ ప్రజలారా ఇకనైనా మేలుకోండి. రాజకీయాలకు రంగులు మార్చే ఈ బీఆర్ఎస్ దొంగలను రాష్ట్రం నుంచే కాదు ఈ దేశం నుంచే తరిమికొట్టాలి” అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news