ముగిసిన బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం.. సీఎం కీలక వ్యాఖ్యలు

-

నేడు తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కీలక భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో పాటు.. రాష్ట్ర కార్యవర్గం, కార్పొరేషన్ల చైర్మన్లు కూడా హాజరయ్యారు. అయితే కాసేపటి క్రితమే ముగిసిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఏడాది కావడం వల్ల అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు సీఎం కేసీఆర్.

తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బిఆర్ఎస్ 105 సీట్లలో గెలుపొందడం ఖాయమని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు తెలిపారు. ఈ పదేళ్లలో ఏం చేశామో ప్రజలకు చెప్పాలని.. చేసింది చెప్పుకుంటే చాలని కేసీఆర్ సూచించారు. మరో ఆరు నెలలలో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ తీసేస్తే మరో 5 నెలల్లో మాత్రమే ఎన్నికలు ఉన్నాయని పేర్కొన్నారు. అందువల్ల నేతలంతా పూర్తిస్థాయిలో నియోజకవర్గాలకు పరిమితం కావాలని సూచించారు. అయితే తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత పరిస్థితుల గురించి కూడా ప్రజలకు వివరించాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version