ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం : కేంద్ర మంత్రి

-

పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకే కేంద్ర సర్కార్ ఆయుష్మాన్ భారత్ పథకం ప్రవేశపెట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన ఆమె.. బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఎయిమ్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రేడియోగ్రఫీ, అధునాతన అల్ట్రా సోనోగ్రఫీ విభాగాలను ప్రారంభించారు. ఓపీ విభాగంలో రోగులతో ముచ్చటించారు.

ప్రజలకు అందుతున్న వైద్య సేవలను గురించి కేంద్ర మంత్రి ఆరా తీశారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందుతుందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఎయిమ్స్ అధికారిక లెటర్‌ని కార్యక్రమంలో ఆవిష్కరించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కను నాటారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎయిమ్స్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

“దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వైద్యుల సేవలు అమోగమైనవి.ఆయుష్మాన్ భారత్ మిషన్ ద్వారా సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందుతోంది. కరోనా మహమ్మారి నుండి పూర్తిగా బయటపడ్డాం.బీబీ నగర్ ఎయిమ్స్​కి రావటం , మిమ్మల్ని కలవటం సంతోషంగా ఉంది, బీబీ నగర్ ఎయిమ్స్ ని అభివృద్ధి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నూతన అన్వేషణలను ప్రోత్సహిస్తుందన్నారు.”-భారతీ ప్రవీణ్​ పవర్​, కేంద్ర ఆరోగ్య సహాయ శాఖ మంత్రి

Read more RELATED
Recommended to you

Latest news