BRS ఒక్క సీటు గెలిచినా రాజకీయాలనుండి తప్పుకుంటా – మాణిక్ రావ్ థాక్రే

-

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. జూలై 11, 12, 13 తేదీలలో యూత్ కాంగ్రెస్ ప్లీనరీ నిర్వహించనున్నామని తెలిపారు. దేశంలో బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అబలంబిస్తుందని.. బిజెపి అనుసరిస్తున్న విధానాలపై యూత్ కాంగ్రెస్ ప్లీనరీలో చర్చిస్తామని అన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు గెలిచినా తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు ఠాక్రే.

కర్ణాటక ఎన్నికల తరువాత పార్టీలో జోష్ పెరిగిందన్నారు. కర్ణాటకలో 30% కమిషన్ ప్రభుత్వం ఉంటే.. తెలంగాణలో 50% కమిషన్ ఉందని ఆరోపించారు. బిజెపి – బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని.. రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని అన్నారు. ఇక షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ వస్తున్న వార్తలపై ఆయన రియాక్ట్ అయ్యారు. షర్మిల పార్టీలోకి వస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి చాలా లాభం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news