BREAKING : చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్

-

BREAKING : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. హైదరాబాదులోని చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11.30 గంటలకు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, చంద్రబాబు ఇంటికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు.

కుప్పంలో పోలీసులు చంద్రబాబును అడ్డుకున్న నేపథ్యంలో చంద్రబాబును పరామర్శించడానికి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. వైజాగ్ లో పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నప్పుడు విజయవాడలో పవన్ కళ్యాణ్ ను కలిసి పరామర్శించారు చంద్రబాబు. ఇక ఇప్పుడు… చంద్రబాబును పరామర్శించడానికి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, ప్రతిపక్ష సభలపై ఆంక్షలు, ప్రతిపక్ష నేతలపై కేసులు, దాడులు వంటి అంశాలపై వీరిద్దరూ చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version