సోదరభావానికి నిలువెత్తు నిదర్శనమే రాఖీ పౌర్ణమి – సీఎం కేసీఆర్

-

సోదరభావానికి నిలువెత్తు నిదర్శనమే రాఖీ పౌర్ణమి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మానవ సంబంధాల్లోని పవిత్రమైన సహోదరభావాన్ని బలోపేతంచేసే రక్షా బంధన్ (రాఖీల పండుగ) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నాతమ్ముండ్లు తమ అక్కా చెల్లెండ్లకు ఎల్ల వేళలా అండగా నిలబడుతారనే భరోసాభావన రాఖీ పండుగ లో ఇమిడి ఉన్నదని సిఎం కేసీఆర్ అన్నారు.

సోదరభావంతో ప్రేమానురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి నాడు, రాఖీలు కట్టుకుంటూ జరుపుకునే రాఖీ పండుగ, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో అనాది నుంచి కొనసాగుతున్న గొప్ప ఆచారమని సిఎం పేర్కొన్నారు. రక్షాబంధన్ వేడుకల సందర్భంగా దేశ ప్రజల నడుమ సహోదర భావం మరింతగా పరిడవిల్లాలని సిఎం కేసీఆర్ ఆకాంక్షించారు. అటు ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా రక్షాబంధన్ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news