KCR: లండన్ లో ‘ఛలో నల్గొండ’ పోస్టర్ ఆవిష్కరణ

-

కృష్ణా నదీ ప్రాజెక్టులు, నదీ జలాల హక్కుల పరిరక్షణకై బీఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో ఫిబ్రవరి 13 న నిర్వహించనున్న ‘ఛలో నల్లగొండ’ భారీ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని పిలుపునిస్తూ లండన్ లోని ఎన్నారై బీఆర్ఎస్ యూకే కేంద్ర కార్యాలయంలో ‘ఛలో నల్లగొండ’ భారీ బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరించారు కోర్ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్ గౌడ్ దూసరి , నవీన్ రెడ్డి , సిక్కా చంద్రశేఖర్ గౌడ్ , సురేష్ బుడగం, రవి రేతినేని మరియు సతీష్ రెడ్డి గొట్టెముక్కల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ రథసారథి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వనరులు సురక్షితంగా ఉన్నాయని, కానీ రెండు నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి నాటి సమైక్య పాలనను గుర్తు తెస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎప్పటికైనా మన తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని తెలిపారు. తెలంగాణ హక్కులను కాలరాస్తే బీఆర్ఎస్ పార్టీ అడుగడుగునా పోరాటాం చేస్తూ ప్రజలకు అండగా నిలబడుతుందని తెలిపారు. ఫిబ్రవరి 13 వ తేదీనాడు నల్గొండలో జరగబోయే సభకు అన్ని వర్గాల ప్రజలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి తెలంగాణ వనరులు కాపాడుకుందామని పిలునిచ్చారు. గెలుపు ఓటములకు సంబంధం లేకుండా మేమంతా కెసిఆర్ గారి వెంటే ఉండే ఉద్యమ సైనికులమని అన్ని వేళలా వారి వెంటే ఉంటామని,వారు చేపట్టిన ప్రతీ కార్యక్రమంలో క్రియాశీలకంగా పాల్గొంటామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version