Telangana: కేసు పెట్టడానికి వచ్చిన మహిళను చితకబాదిన సీఐ !

-

Telangana: కేసు పెట్టడానికి వచ్చిన మహిళను చితకబాదాడు సీఐ. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన బోయ భాగ్య అనే మహిళ తన కుమారుడితో కలిసి ఎడపల్లి మండలం జానకంపేట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవాలకు వెళ్ళిందని చెబుతున్నారు.

CI crushed the woman who came to file a case

ఇక ఉత్సవాల్లో తన పర్సు పోయిందని అక్కడే ఉన్న పోలీసు ఔట్ పోస్టులో బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబుకు ఫిర్యాదు చేసిందట. ఫిర్యాదు చేసిన మహిళను దూషిస్తూ, అనవసరంగా రాద్ధాంతం చేస్తావా అంటూ లాఠీతో మహిళను విచక్షణా రహితంగా సీఐ చితకబాదాడని చెబుతున్నారు. దీంతో వాతలు వచ్చేలాగా దారుణంగా కొట్టాడు అని సీఐ విజయ్ బాబు మీద ఎడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మహిళ. ఇక ఈ సంఘటన ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version